»Magnitude 5 9 Earthquake Hits Japan No Tsunami Warning
Earthquake : జపాన్‌లో భూకంపం.. భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీసిన జనం
ద్వీప దేశం జపాన్ ను భూకంపం మరో సారి కుదిపేసింది. దీంతో అక్కడి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే సునామీ ప్రమాదం ఏమీ లేదని స్థానిక అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Earthquake : జపాన్‌లో నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపాలు(EARTH QUAKE) సంభవించాయి. సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో నోటో నగరంలో ఇలా భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై 5.9 తీవ్రతతో ఒకసారి భూమి కంపించింది. ఆ తర్వాత పది నిమిషాలకే 4.8 తీవ్రతతో మరో సారి భూమి కంపించింది. దీంతో ఆ నగరంలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. అలాగే ఇప్పటి వరకు ఉన్న డాటా ప్రకారం సునామీ వచ్చే అవకాశాలు లేవని స్థానిక అధికారులు వెల్లడించారు.
జపాన్‌లో సంభవించిన(JAPAN) ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రెండు అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయని వాటిపైన సైతం ఈ ఎర్త్ క్వేక్(EARTH QUAKE) ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదని అన్నారు. నోటో లోని షికా ప్లాంట్‌కు మాత్రం కొద్దిగా నష్టం వాటిల్లిందని వెల్లడించారు. సెక్యూరిటీ ఇన్స్పెక్షన్స్ దృష్ట్యా ఈ ప్రాంతంలో తిరిగే సూపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఇతర రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ట్రాక్‌లను పరిశీలించిన తర్వాత మాత్రమే రైళ్ల రాకపోకలను తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. ఈ ఏడాది మొదట్లో జనవరి 1న సైతం ఈ ప్రాంతంలో పెద్ద భూకంపం సంభవించింది. దీంతో 230 మంది చనిపోయారు.