GNTR: దుగ్గిరాల రైలుపేట శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రతాలు ఘనంగా జరిగాయి. అర్చకులు సాకేత్శర్మ, రామచంద్రల నేతృత్వంలో 108 మంది దంపతులు పాల్గొన్నారు. స్వామివారి మహిమను వివరిస్తూ ఐదు అధ్యాయాలను పఠించగా, అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.