జపాన్‌లో యువత ఇప్పుడు మరొక ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనే ఓ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మరి ఈ ట్రెండ్ గురించి పూర్తిగా వివరాల్లో తెలుసుకుందాం.
Japan: ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశంలో సంస్కృతి, సంప్రదాయాలు వేర్వేరుగా ఉంటాయి. ఇదిలా ఉండగా జపాన్‌లో యువత ఇప్పుడు మరొక ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనే ఓ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్‌లో జంటల మధ్య ప్రేమ లేదా ఇతర సంబంధాలు ఉండవు. ఇష్టపడిన యువతీ యువకులు, స్వలింగ సంపర్కులు ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకోవాలి. ఇలా వివాహం చేసుకున్న జంటలు వివాహంపై నమ్మకం కోల్పోరు.
ఇలా పెళ్లి చేసుకున్న వ్యక్తులు వాళ్ల భాగస్వాములతో సమయం గడపవచ్చు. సమస్యలను పంచుకోవచ్చు. చట్టబద్ధంగా భార్యభర్తలే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ, ఎలాంటి శృంగార సంబంధం ఉండదు. కొందరు కలిసి జీవిస్తే.. మరికొందరు వేర్వేరుగా ఉంటారు. పిల్లలు కావాలనుకున్నవాళ్లు కృత్రిమ గర్భధారణ విధానాలను అనుసరిస్తారు. పరస్పర అంగీకారం ఉంటే తమకు నచ్చిన వాళ్లతో ఇద్దరు స్వేచ్ఛగా ఉండవచ్చు.
అయితే వివాహం అంటే ఇష్టం లేని వాళ్లు ఈ బంధం వైపు మొగ్గు చూపుతున్నారని జపాన్ సంస్థ తెలిపింది. జపాన్‌లో మొత్తం 12 కోట్లకు పైన జనాభా ఉండగా.. ఇందులో ఒకశాతం మంది ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ట్రెండ్‌లో ఉండవచ్చని తెలిపింది. ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించే వాళ్ల వయస్సు ఎక్కువగా 32 ఏళ్లు ఉంటుందట. అలాగే వీరిలో 85 శాతం మంది డిగ్రీ, ఉన్నత విద్య చదివిన వాళ్లే. పెళ్లి విషయంలో సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువత ఈ ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నారట.