Pushpa 2: 12 దేశాల్లో ట్రెండ్ అవుతున్న’పుష్ప 2′ సాంగ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న 'పుష్ప 2' పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్టేట్ వచ్చిన సరే.. మూవీ లవర్స్ సాలిడ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ సాంగ్ ఓ రేంజ్లో దూసుకుపోతోంది.
Pushpa 2: పుష్ప 2 సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తే వెయ్యికోట్లు పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పుష్ప2 నుంచి వచ్చిన టీజర్ అదిరిపోయింది. ఇక పుష్ప పుష్ప అంటూ సాగే ఫస్ట్ సాంగ్ దుమ్ముదులిపేసింది. ఈ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ చేయగా.. అదే రేంజ్ స్పందన వస్తోంది. సూసేకి.. అంటూ సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పుష్ప రాజ్, శ్రీవల్లి మధ్య సాగే ఈ కపుల్ సాంగ్ కలర్ ఫుల్‌గా అదిరిపోయింది. బన్నీ, రష్మిక ఊగుతూ చేసిన సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.. యూట్యూబ్‌లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది సెకండ్ సింగిల్.
24 గంటల్లో తెలుగు వెర్షన్‌కి 10 మిలియన్లు, హిందీ వెర్షన్‌కి 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఓవరాల్‌గా 24 గంటల్లో 31 మిలియన్ రియల్ టైం వ్యూస్, 900K లైక్స్, 19 మిలియన్స్ అప్డేటెడ్ వ్యూస్ సాధించి.. 12 దేశాల్లో యూట్యూబ్‌లో టాప్ ట్రెండ్ అవుతోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మేకర్స్. ఇక శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పుష్ప2ని, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది పుష్ప2. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అంతకుమించి అనేలా కష్టపడుతున్నాడు. కుదిరితే మరోసారి నేషనల్ అవార్డ్ కొట్టేయాలని చూస్తున్నాడు. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.