Taman acting again.. Premalu Beauty as the heroine?
Taman: వాస్తవానికైతే తమన్‌కు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉంది. కానీ అనుకోకుండా యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తమన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కానీ బాయ్స్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు తమన్. దీంతో.. యాక్టింగ్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్ని సినిమాల్లో మాత్రం గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఇక సంగీత దర్శకుడిగా ఇప్పుడు తమన్ క్రేజ్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. టాలీవుడ్లో వస్తున్న భారీ సినిమాలన్నింటికి దాదాపుగా తమనే మ్యూజిక్ అందిస్తున్నాడు. రాజాసాబ్, ఓజి, గేమ్ చేంజర్, ఎన్బీకె 109 వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మరోసారి తమన్ యాక్టింగ్ చేయడానికి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రేమలు బ్యూటీ మమిత బైజు నటిస్తుండడం విశేషం.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో అధర్వ మురళీ హీరోగా నటిస్తున్నాడు. అధర్వకు జోడీగా మమిత బైజుని హీరోయిన్గా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అమ్మడు సూపర్ ఛాన్స్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో ఆకాష్ భాస్కరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలోనే తమన్ కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా పూర్తిస్థాయి రోల్ అని అంటున్నారు. అయితే.. తమన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే.. తమన్ నిజంగానే నటిస్తున్నాడా? లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.