MLG: సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కన్నాయిగూడెం ఎస్సై ఇనుగాల వెంకటేష్ సూచించారు. కాలనీలు, ఇళ్లు, షాపులు, అపార్ట్మెంటులలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇరుగుపొరుగు వారికి ఇంటిని గమనించమని చెప్పి, విలువైన వస్తువులను బయటకు కనిపించేలా ఉంచకూడదని స్పష్టం చేశారు.