ప్రస్తుతానికి మూవీ లవర్స్ అంతా కల్కి కోసమే వెయిట్ చేస్తున్నారు. థియేటర్లో పెద్ద సినిమా చూసి చాలా రోజులు అవుతోంది. అందుకే.. జూన్ 27న రానున్న కల్కి కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా కల్కి రన్ టైం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
Kalki 2898 AD: సలార్ వంటి మాసివ్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కల్కి 2898ఏడి పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. భారీ ఈవెంట్‌తో బుజ్జిని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. బుజ్జితో కలిసి పాన్ ఇండియా లెవల్లో దేశమంతా చుట్టేయబోతున్నారు. ప్రస్తుతం బుజ్జి చెన్నై రోడ్ల పై షికారు చేస్తోంది. మరోవైపు కల్కి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో కల్కి రన్ టైం రివీల్ అయిందని అంటున్నారు. కల్కి 2898 ఏడి సినిమా భారీ రన్ టైం ఫిక్స్ చేసుకున్నట్టుగా సమాచారం. 3 గంటల రన్ టైంతో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలన్నీ కూడా దాదాపు 3 గంటలకు అటు ఇటుగా రన్ టైంతోనే థియేటర్లోకి వస్తున్నాయి.
కాబట్టి.. కల్కి కూడా మూడు గంటల రన్ టైంతో రానుందనే చెప్పాలి. ప్రభాస్ లాంటి హీరోకి ఇదేం పెద్ద రన్ టైం కాదు. సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన సరే బాక్సాఫీస్ షేక్ అవడం గ్యారెంటీ. అయితే.. కల్కి సినిమాను రెండు భాగాలు ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. అంతేకాదు.. నాగ్ అశ్విన్ యూనివర్స్ చేసే ప్లానింగ్‌లో కుడా ఉన్నాడట. కాబట్టి.. కల్కి భారీ రన్ టైంతో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోనే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. బుజ్జికి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది. అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తుండగా.. కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి కల్కి ఎలా ఉంటుందో చూడాలి.