చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనే తేడా లేకుండా.. కంటెంట్‌కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో.. యూత్‌ని మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది మళయాళ హిట్ మూవీ ప్రేమలు. ఇప్పుడు సీక్వెల్ అనౌన్స్ చేశారు.
Premalu sequal: ఇటీవల వచ్చిన మళయాళ మూవీ ‘ప్రేమలు’ మంచి విజయాన్ని దక్కించుకుంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండానే మళయాంలో బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమా. యూత్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా కుర్రాళ్లకు మంచి కిక్ ఇచ్చింది. గిరీష్ ఏడి తెరకెక్కించిన ఈ మూవీని.. భావన స్టూడియోస్, ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్, వర్కింగ్ క్లాస్ హీరో సంస్థల వారు నిర్మించారు. నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో హీరోయిన్ మమిత బైజు అందానికి ఫిదా అయ్యారు కుర్రాళ్లు. అంతేకాదు.. అమ్మడికి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
తెలుగులోను ప్రేమలు సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులో ఈ మూవీని రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. రాజమౌళి కూడా ఈ సినిమా చూసి తెగ ఎంజాయ్ చేశానని చెప్పాడు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ 17 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న’ప్రేమలు 2′ మూవీ 2025లో థియేటర్లలోకి రానుంది. ఈ సీక్వెల్ తెలుగు వెర్షన్‌ను కూడా కార్తికేయ రిలీజ్ చేయనున్నాడు.
అయితే.. ప్రేమలు సినిమా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కగా.. సీక్వెల్ కూడా ఇక్కడే ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ మంచి యూత్ ఫుల్ ఎలిమెంట్స్‌తో ప్రేమలు 2 ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రేమలు సినిమా ఓటిటిలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. మరి ప్రేమలు 2 ఎలా ఉంటుందో చూడాలి.