»Nominated Amit Shah No Car How Much Is The Total Property
Amit Shah: నామినేషన్ వేసిన అమిత్ షా.. సొంత కారు లేదు మొత్తం ఆస్తి ఎంతంటే?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అఫిడవిట్లో సొంతంగా కారు లేదని పేర్కొన్నారు. మొత్తం ఆయన ఆస్తి వివరాలను తెలిపారు.
Nominated Amit Shah.. No car, how much is the total property?
Amit Shah: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. ఈ సందర్భంగా అన్ని పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం శుక్రవారం రోజు నామినేషన్ వేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి ఆయన బరిలో ఉన్నారు. నామినేషన్ వేసిన షా ఆయన స్థిర, చరాస్తి వివరాల అఫిడవిట్‌ను అధికారులకు ఇచ్చారు. ఆయన పేరు మీద సొంత కారు లేదని అందులో పేర్కొనడం చర్చనీయాంశం అయింది. మొత్తం రూ. 36 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
అందులో రూ. 20 కోట్ల చరా ఆస్తులు, రూ. 16 కోట్ల స్థిర ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయన సతీమణి సోనాల్‌కు రూ. 31 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అలాగే రూ. 1 కోటి 10 లక్షల విలువైన అభరాణాలు ఉన్నట్లు తెలిపారు. కేంద్రమంత్రికి సైతం రూ. 72 లక్షల విలువైన అభరాణాలు ఉన్నట్లు వివరించారు. ఇక అమిత్ షా పేరుమీద రూ. 15.77 లక్షల అప్పు, సోనాల్ పేరు మీద రూ. 26.32 లక్షల అప్పు ఉన్నట్లు వెల్లడించారు. 2022-23 వార్షిక ఆదాయం రూ. 75.09 లక్షలు ఆయన సతీమణికి రూ. 39.54 లక్షల ఆదాయం పొందినట్లు ఈ ఆదాయంలో వేతనంతో పాటు, ఇంటి అద్దెలు, వ్యవసాయం, షేర్లు, డివిడెండ్ల మీద వచ్చే ఆదాయంగా తెలిపారు. ఆయన వృత్తి రిత్యా వ్యవసాయదారుడని, సామాజిక కార్యకర్త అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇదే లోక్ స్థానం నుంచి 2019లో భారీ మెజారిటీతో గెలిచారు.