Chandrababu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు… అమిత్ షాతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పదిహేను రోజుల వ్యవధిలోనే ఏపీ సీఎం చంద్రబాబు రెండో సారి ఢిల్లీ వెళ్లనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలవరం ప్రాజెక్ట్‌తో సహా పలు అంశాలపై కీలక చర్చించనున్నాడని తెలుస్తుంది.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్ర దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలువనున్నారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులతో కూడా సమావేశం కానున్నారు. ఈ నెల 3 వ తేదీనే ఢిల్లీకి వెళ్లిన బాబు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, తదితర మంత్రులను కలిసొచ్చారు. పదిహేను రోజులు అవకముందే మళ్లీ ఆయన రాజధానికి వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సారి కచ్చితంగా కీలకమైన సమావేశమై ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
ఏపీలో ఎన్డీయే కూటమి కొలువుదీరి నెలరోజులు దాటింది. ఈ సందర్భంగా ఆయన పరిపాలన తదితర అంశాలపై ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెలరోజుల్లో తాము తీసుకున్న అంశాలపై రివ్యూ చేయనున్నట్లు సమాచారం. ఇంకా ఏ అంశాల మీద దృష్టి సారించాలి, ఎక్కడ పురగతి సాధించాలి, అభివృద్ధి సాధించే విభాలు ఏంటి అనే అంశాలపై ప్రసంగించనున్నట్లు తెలుస్తుంది. తరువాత కేంద్రంతో మాట్లాడే అంశాలపై చర్చినున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేసిన బుధవారం ఉదయం హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. విభజన హామీలను, అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కీలకంగ చర్చించనున్నట్లు తెలుస్తుంది.