»Amit Shah Action Against Drugs With Drug Supply Destructive System
Amit Shah : కొత్త సిస్టం ద్వారా ఒక్క గ్రాము డ్రగ్స్‌ని కూడా దేశంలోకి రానీయం : అమిత్‌షా
డ్రగ్స్ సరఫరా నియంత్రణ కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఒక్కగ్రాము డ్రగ్స్‌ని కూడా దేశంలోకి రానిచ్చేది లేదని తెలిపారు. ఈ విషయాలపై ఆయన ఏం మాట్లాడారంటే?
Amit Shah About Drugs : దేశంలోకి డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపబోతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కొత్తగా ‘డ్రగ్స్ సప్లై డిస్ట్రక్టివ్ సిస్టం’ని(DRUG SUPPLY DESTRUCTIVE SYSTEM) తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధానం ద్వారా దేశంలోకి ఒక్క గ్రాము డ్రగ్స్‌ని కూడా రానీయకుండా చేస్తామని చెప్పారు. అలాగే మన దేశం నుంచి బయటకు కూడా సరఫరా కానీయకుండా చూస్తామని తెలిపారు. అక్రమంగా ఉన్న డ్రగ్స్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దిల్లీలో కేంద్ర, రాష్ట్ర యాంటీ నార్కోటిక్ సంస్థల అపెక్స్ సమావేశంలో పాల్గొన్న అమిత్‌షా ప్రసంగించారు.
డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని అయినా ప్రభుత్వానికి అందించవచ్చునని అమిత్ షా(AMIT SHAH) తెలిపారు. మానస్ పేరుతో ‘1933’ హెల్ప్ లైన్ నెంబర్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ncbmanas.gov.in అనే వెబ్సైట్ ద్వారా, info.ncbmanas@gov.in ఈమెయిల్ ద్వారా కూడా డ్రగ్స్ వ్యవహారాలపై తమకు సమాచారం ఇవ్వవచ్చని చెప్పారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్సీబీ) ఇందుకు సంబంధించిన చర్యలను వెనువెంటనే తీసుకుంటుందని చెప్పారు.