»June 25 To Be Observed As Samvidhaan Hatya Diwas Amit Shah
Amit Shah: జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్ నిర్వహించాలని అధికారిక ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజును సంవిధాన్ హత్యా దివస్ ప్రభుత్వం జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
June 25 To Be Observed As 'Samvidhaan Hatya Diwas Amit Shah
Amit Shah: కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజును సంవిధాన్ హత్యా దివస్ ప్రభుత్వం జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 1975 జూన్ 25 భారత దేశ రాజ్యాంగాన్ని హత్య చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు.
“1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ దేశంలో ఎమర్జెన్సీని విధించి భారత ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏ కారణం లేకుండానే లక్షల మందిని జైల్లో పెట్టి, మీడియా గొంతు నొక్కారు. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్యా దినం’గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ రోజు 1975 ఎమర్జెన్సీ అమానవీయ బాధను భరించిన వారందరిని స్మరించుకుంటుంది.” అని ట్వీట్లో రాసుకొచ్చారు.
25 जून 1975 को तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी ने अपनी तानाशाही मानसिकता को दर्शाते हुए देश में आपातकाल लगाकर भारतीय लोकतंत्र की आत्मा का गला घोंट दिया था। लाखों लोगों को अकारण जेल में डाल दिया गया और मीडिया की आवाज को दबा दिया गया। भारत सरकार ने हर साल 25 जून को 'संविधान… pic.twitter.com/KQ9wpIfUTg