CM Revanth Reddy's key comments on farmer loan waiver
CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సీఎం ముఖ్యమంత్రి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు రుణమాఫీని మొత్తం మూడు దఫాలుగా చేయబోతున్నట్లు వెల్లడించారు. రేపు సాయంత్రం 4 గంటలలోగా రూ. 1 లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన డబ్బులను నేరుగా రైతల ఖాతాల్లోనే జమ చేస్తామని పేర్కొన్నారు.
అనంతరం జూలై నెలాఖరునా రెండో దఫాలో లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేస్తమని పేర్కొన్నారు. తరువాత ఆగస్ట్ నెలలో రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. ఇది రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న బహుమతి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. అందుకోసం రూ.30 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు. రైతు ఆత్యగౌరవాన్ని నిలబెట్టేందుకు రూ. 2 లక్షల రుణమాఫిని చేస్తున్నట్లు తెలిపారు. ఇది కచ్చితంగా రైతులకు శుభవార్త అని తెలిపారు.