KNR: రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయడమే బీజేపీ ముందున్న లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.