VSP: ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ 2025లో ఆదాయం, మౌలిక వసతుల అభివృద్ధిలో చారిత్రక రికార్డులు సృష్టించింది. డివిజన్, భారతీయ రైల్వేలో ఆదాయం, లోడింగ్‌లో 5వ స్థానాన్ని దక్కించుకుని నవంబర్ నాటికి రూ.9,030 కోట్ల ఆదాయం నమోదు చేసిందని డీఆర్ఎం లలిత్ బోహ్రా బుధవారం తెలిపారు. ఈ ఏడాది రూ.1,200 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామన్నారు.