VZM: విజయనగరం సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబీత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించి వారికి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది గాని తోటి ఖైదీలు గాని ఎటువంటి వివక్షత చూపించరాదన్నారు. జైలులో ఉన్న ఖైదీల వివరాలను ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు.