PDPL: శాస్త్రి నగర్లో గల శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి భక్తులు స్వామివారి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పురవీధుల గుండా సాగిన రథయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అయ్యప్ప స్వామి దీక్ష ధారణ చేసిన స్వాములు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై చేసిన భజనలు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.