TG: కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి KTR మండిపడ్డారు. సిరిసిల్ల అపారెల్ పార్క్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘అపారెల్ పార్క్‌లో మా హయాంలో వచ్చిన రెండు పరిశ్రమలు మినహా ఇప్పటి వరకు కొత్తగా ఒక్కటీ రాలేదు. 25వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పార్క్ ఏర్పాటు చేశాం’ అన్నారు.