ADB: భీంపూర్ మండలంలోని భగవన్ పూర్ గ్రామస్తులు ఎస్సై భూపాలపల్లి విక్రంను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యువరాజ్ ఎస్సైను గ్రామస్తులతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రామాభివృద్ధిలో యువకులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విక్రం సూచించారు.