PDPL: రామగిరి మండలం రాజపూర్ గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జిల్లా డీపీవో వీరబుచ్చయ్యకు సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్ కలవేణ శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. ఇంటి పన్ను, ఇతరితర పన్నుల రూపంలో వచ్చిన నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడుకుని దుర్వినియోగం చేశారని తెలిపారు. విచారణ జరిపి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.