W.G: పేరుపాలెం బీచ్లో బుధవారం స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్లీన్-అప్ డ్రైవ్ కార్యక్రమాన్ని వైఎన్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహించారు. ఎంపీడీవో త్రిశులపాణి, స్వచ్ఛాంద్ర జిల్లా కోఆర్డినేటర్ రోహిత్ విద్యానంద్ పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది చివరి రోజున సమాజానికి, పర్యావరణానికి తమ వంతుగా ఇతరులకు స్ఫూర్తి నింపుతూ క్లీన్ అప్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు.