ASF: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియా ఆటో స్టాండ్ వద్ద నూతనంగా నిర్మించిన సులభ్ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రారంభించారు. వాల్మీకి సఫాయి కర్మచారి సేవా సంఘ్ ఆధ్వర్యంలో బీఓటి పద్ధతిలో దీనిని నిర్మించారు. జిల్లాకు వచ్చే ప్రజలు, వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.