MBNR: జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించగా, మద్యం తాగి వాహనం నడుపుతూ ఒక వ్యక్తి పట్టుబడినట్లు వన్ టౌన్ అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తిని బుధవారం కోర్టులో హాజరుపరచగా.. కేసును విచారించిన సెకండ్ క్లాస్ ఆర్.శశిధర్ నిందితుడికి రూ.3,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.