SKLM: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీకాకుళం నగర పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం రూరల్ పరిధిలో ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ నిఘాలో పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని అన్నారు.