VZM: కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సురక్షంగా ఉన్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. విజయనగరంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు పనితనంతో రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.