KDP: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరును అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకువస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం పార్టీ నాయకులు వరదరాజు రెడ్డితో ముందస్తుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేయించారు. నియోజకవర్గంలో ప్రధాన రోడ్ల విస్తరణ, తాగునీటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.