AKP: నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత పరీక్షల మెటీరియల్ పంపిణీ చేశారు. ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తలుపులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాత ఇచ్చిన విరాళంతో మెటీరియల్ అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.