MDK: జిల్లాలో 500 ఎకరాలకు పైబడి ఆయకట్టు కలిగిన 9 చెరువుల 4200 ఎకరాల ఆయకట్టు పంటలకు నీరు విడుదలకు చర్చించి నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఘనాపూర్ ఆయకట్టు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు.