SRD: భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఉత్తమ సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. నగర పరిశుభ్రతలో వారి సేవలు అమూల్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.