కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నం లోని కలెక్టరేట్లో డీఆర్వో కే. చంద్రశేఖర రావుతో కలిసి కలెక్టర్ బాలాజీ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.