SRD: జిల్లాలో 4598 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. సహకార సంఘాల వద్ద 312 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 621 మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్ బఫర్ స్టాక్ వద్ద 3,665 మెట్రిక్ స్టాక్ ఉందని చెప్పారు. యూరియా సరఫరా విడతల వారీగా కొనసాగుతుందని పేర్కొన్నారు.