BPT: పదో తరగతి చదివి జల్సాలకు బానిసై వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని చెరుకుపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. చెరుకుపల్లి మండలంలోని వివిధ ప్రాంతాలలో ఇంటి ముందు పార్కు చేసిన బైక్స్‌ను దొంగతనం చేస్తున్న చందోలు జశ్వంత్‌ను అరెస్ట్ చేసినట్లు చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. అతని నుంచి 4 బైకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.