MBNR: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ పురుషుల హాకీ జట్టును మంగళవారం వనపర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో ఎంపిక చేసినట్లు ఫిజికల్ డైరెక్టర్ వై. శ్రీనివాసులు తెలిపారు. ఈ జట్టు జనవరి 12 నుంచి 16 వరకు చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు.