MDK: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేశారు. శాంతి భద్రతల విషయంలో తీసుకోవలసిన ముందస్తు చర్యలపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. రాత్రి గస్తీని మరింత బలపరచడం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.