W.G: మర్రి లక్ష్మణరెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో డిసెంబర్ 22 నుంచి 28 వరకు హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులో తణుకు విద్యార్థి ప్రాతినిధ్యం వహించారు. తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో బీఎస్సీ చదువుతున్న సింగమంపల్లి ఉమశ్రీలక్ష్మి పాల్గొన్నట్లు ప్రిన్సిపల్ యు. లక్ష్మిసుందరీబాయ్ తెలిపారు.