HNK: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. మొత్తం 5నెలల 15 రోజుల హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. ఈ క్రమంలో మొత్తం రూ. 8,68,742 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కింపులో నోట్ల రూపంలో 8,04,270 రాగా.. నాణేల రూపంలో రూ. 64,472 వచ్చాయన్నారు.