VZM: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి, సంక్షేమం పరంగా పాలన సాగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 16 వేలు DSC, 6 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అందించామన్నారు. ఒక్క చాన్స్ అంటూ వైసీపీ దుర్మార్గమైన పాలనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు.