BDK: పినపాక మండలంలో నిర్వహించనున్న 69వ జాతీయ స్థాయి SGFI అండర్-17 బాలుర కబడ్డీ పోటీలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం హైదరాబాద్లో సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఈ పోటీలు జరగనున్నట్లు తెలిపారు.