SDPT: నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చేర్యాల సీఐ శ్రీను ప్రజలకు సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కుంటే యువత భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు. మద్యం మత్తులో ప్రమాదాలు, గొడవలకు దూరంగా ఉండాలని, కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టవద్దని కోరారు.