BHPL: వసతి గృహాల్లో విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రత, విద్య, భోజనం, వైద్య సౌకర్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.