BHPL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి, బేస్మెంట్ లెవల్ పూర్తయితే విడతలవారీగా నగదు జమ చేయాలని సూచించారు. ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.