W.G: భీమవరం ప్రజల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ కమిటీ నూతన ఛైర్మన్గా బొండాడ నాగభూషణం ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఇవాళ నూతన కమిటీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం వారు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.