SDPT: కల్లేపల్లి గ్రామపంచాయతీలో నెలకొన్న నీటి సమస్యల పరిష్కారానికి సర్పంచ్ బిగుళ్ల మోహన్ ఆధ్వర్యంలో బుధవారం విస్తృత స్థాయి ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. గ్రామంలో కుంగిపోయిన ఓపెన్ వెల్ మరమ్మత్తులతో పాటు తాగునీటి సరఫరా మెరుగుదలపై దృష్టి సారిస్తూ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనిత గ్రామపంచాయతీ కార్యదర్శి కరీంతో కలిసి పరిశీలన చేపట్టారు.