MBNR: ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును మార్చి 3వరకు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సునీత ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కోర్సుల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాలన్నారు.