చిత్తూరు చర్చి వీధిలో రుక్మిణి సత్యభామ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ద్వాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, పూజలు, గోదాదేవి తిరుప్పావై సేవ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ఆలయాన్ని దర్శించారు. ఆలయంలో చేసిన విశేషాలంకారం భక్తులను ఆకట్టుకుంది.