BHPL: జిల్లా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి త్వరలో MRI మెషిన్ ఏర్పాటు చేయనున్నట్లు MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో HDFC బ్యాంక్ CSR నిధుల చెక్కును కలెక్టర్ రాహుల్ శర్మ, బ్యాంక్ రీజినల్ హెడ్ వెంకటేష్ చల్వర్తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ MRIతో రోగులు ఎంజీఎం, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తొలగుతుందని అన్నారు.