ATP: తన ప్రవర్తనపై ప్రజల్లో ఉన్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో రేపు తాడిపత్రిలో నిరాహార దీక్ష చేయనున్నట్లు JC ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో వివరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన తీరు మంచిది కాదని ప్రజలు చెబితే మార్చుకుంటానని తెలిపారు. 2026లో తాడిపత్రిని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.