GNTR: జిల్లాలో జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాజ ముద్రతో రూపొందించిన 35,690 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. జనవరి 2న జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించి, అనంతరం మండల–గ్రామ స్థాయిల్లో రైతులకు పాసు పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు.