ADB: చదువుతోనే జీవిత లక్ష్యాన్ని సాధించాలని తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన ఉపాద్యాయురాలు ఏలటి జ్ఞాన ప్రగతి పేర్కొన్నారు. ఇటీవల స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) ఉద్యోగం సాధించిన ఆమే బుధవారం కప్పర్ల గ్రంథాలయ నిర్వహణ ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలను విరాళంగా అందజేశారు. గ్రంథాలయ నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు.