మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 1990 బ్యాచ్ IPS అధికారి సదానంద్ వసంత్ దాతేను డీజీపీగా నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 3 బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, సదానంద్ దాతే 26/11 ముంబై అటాక్స్ సమయంలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.